అజిత్ మరియు త్రిష నటించిన పట్టుదల (విదాముయార్చి) మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ రాబట్టింది. ఈ మూవీ ఇండియాలో రూ. 22 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అయితే, గ్రాస్ ఎంతనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పట్టుదల మూవీ గురువారం థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీని కలిగి ఉంది. పట్టుదల మూవీ తమిళంలో మొత్తం 61.24 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. ఉదయం షోలు 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం మరియు సాయంత్రం షోలలో 54.79 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. తిరుచ్చి మరియు పాండిచ్చేరి వరుసగా చెన్నై కంటే 92.00 శాతం మరియు 91.67 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. ఇక చెన్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
ఈ వీకెండ్ లో పట్టుదల మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ ఇండియా మూవీస్ చూసుకుంటే.. ఈ మూవీ ఉత్తర అమెరికాలో 5వ స్థానంలో, మలేషియాలో 1వ స్థానంలో నిలిచింది.
Also Read : స్టార్ హీరో కొడుకు కోసం
అయితే, అజిత్ నటించిన గత మూవీ 'తునివు' ఫస్ట్ డే ఇండియాలో రూ.24.4 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ మూవీతో పోలిస్తే.. పట్టుదలకి తక్కువే వచ్చిందనే చెప్పుకోవాలి. మగీజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో అజిత్ స్క్రీన్ ప్రజెన్స్, క్యారెక్టరైజేషన్ అదిరింది. ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్ కు యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ లో నటించే అవకాశం దొరికింది. భార్య దూరమైనపుడు పడే బాధ, ఆమె ప్రేమ కోసం పరితపించే సీన్స్‌లో మెప్పిస్తాడు.
పట్టుదల కథ కోసం దర్శకుడు మగీజ్ తిరుమేని ఎక్కువగా కష్టపడలేదు. ఓ భార్య మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే ఓ భర్త కథ ఇది. ఈ సింపుల్ పాయింట్ తీసుకుని తనదైన స్క్రీన్ ప్లే తో మ్యూజిక్ చేశాడు డైరెక్టర్.