Good Bad Ugly Box Office: భారీగా పడిపోయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ‘డే2’ కలెక్షన్స్.!

Good Bad Ugly Box Office: భారీగా పడిపోయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ‘డే2’ కలెక్షన్స్.!

స్టార్ హీరో అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'  (Good Bad Ugly) మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ సాధించింది. తొలిరోజు రూ.30.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇది అజిత్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్‌ సాధించిన మూవీగా నిలిచింది. అయితే, రెండో రోజు మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. రెండవ రోజు దాదాపు 50 శాతం తగ్గుదల కనిపించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

నేడు శనివారం నుంచి వీకెండ్ షురూ అవ్వడంతో వసూళ్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం కావడంతో, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

సాక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం:

'గుడ్ బ్యాడ్ అగ్లీ' రెండ్రోజుల వసూళ్ల విషయానికి వస్తే.. ఈ మూవీ రూ.42.75 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఫస్ట్ డే (గురువారం) రూ.29.25 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. తమిళంలో రూ.28.15 కోట్లు, తెలుగులో రూ.1.1కోట్లు దక్కించుకుంది. సెకండ్ డే (శుక్రవారం) నాటికి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఇండియా వైడ్ గా రూ.13.9 కోట్లు నెట్ సాధించింది. తమిళంలో రూ.13.03కోట్లు, తెలుగులో రూ.0.87లక్షలు చేసింది. 

తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తీసిన ఈ సినిమా, తెలుగు ఆడియన్స్కి పెద్దగా ఎక్కట్లేదని టాక్ వినిపిస్తోంది. అయితే, తమిళంలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.