
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. ఫ్యాన్స్ హంగామా మొదలువుతుంది.. ఈ క్రమంలో థియేటర్స్ దగ్గర భారీ కటౌట్లు కట్టడం, పాలాభిషేకం చెయ్యడం పూల దండలతో థియేటర్స్ ని ముస్తాబు చెయ్యడం అబ్బో హడావుడి మాములుగా ఉండదు. అయితే ఈ కటౌట్లు కట్టే క్రమంలో ఒక్కోసారి పై నుంచి క్రిందపడి ఒకరిద్దరు అభిమానులు నటించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
తాజాగా తమిళనాడులో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కటౌట్ కడుతుండగా కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది. ఈ కటౌట్ దాదాపుగా 285 అడుగులు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కటౌట్ నిర్మిస్తున్న సమయంలో పైన ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం జరగలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఈ సంఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | Ananya Nagalla : బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ అనన్య నాగళ్ల
అయితే 2023లో అజిత్ 'తునివు' ప్రీమియర్ షో జరుగుతుండగా ఆయన అభిమాని ఒకరు మరణించారు . అప్పటి నుండి అలాంటి ప్రమాదాలను నివారించడానికి తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ఉదయం షోలను రద్దు చేసింది. దీంతో అజిత్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ తన ఫ్యాన్స్ సేఫ్ గా ఉండాలని అలాగే తమ కుటుంబాలని బాగా చూసుకుపోవాలని అప్పుడే తాను సంతోషంగా ఉంటానని ఫ్యాన్స్ కి సూచించాడు.
THALA AJITH India's Biggest Cutout Collapsed
byu/affordtrusting inkollywood
ప్రస్తుతం హీరో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి తమిళ్ ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అజిత్ కి తమిళ్ తోపాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో తెలుగు, మళయాళం, హిందీ తదితర పాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.