Good Bad Ugly Review: గుడ్ బ్యాడ్ అగ్లీ X రివ్యూ.. అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Good Bad Ugly Review: గుడ్ బ్యాడ్ అగ్లీ X రివ్యూ.. అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ అజిత్‌‌‌‌ కుమార్ (Ajith Kumar) హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ గురువారం (2025 ఏప్రిల్ 10న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రీమియర్ షోలు ఏప్రిల్ 9న కంప్లీట్ అయ్యాయి. మరి, సినిమా టాక్ ఎలా ఉందో X రివ్యూలో తెలుసుకుందాం. 

హీరో అజిత్ కుమార్ కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు పులిష్టాప్ పడింది. 

ఈ సినిమా చుసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా మాస్ యాక్షన్ తో అదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు. అజిత్ మాస్ ఎంట్రీ కొత్త ఉత్సాహాన్ని నింపిందని,  తల అజిత్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు గూస్బంప్స్ అంటూ X లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది అసలైన అజిత్ కుమార్ ఫ్యాన్ భాయ్ మూమెంట్ అని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ అజిత్ కెరీర్లోనే ది బెస్ట్ అని పోస్టులు పెడుతున్నారు.  

ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఒక  "వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్. నాకు వైలెన్స్ ఇష్టం. తల తిరిగి వచ్చాడు" అని రాశాడు.

మరో నెటిజన్ స్పందిస్తూ.. 'ఇప్పుడే స్వీడన్‌లో షో కంప్లీట్.. సినిమా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ అధిక్ నుండి పక్కా ఫ్యాన్ బాయ్ సంభవం. ముఖ్యంగా అజిత్ స్వాగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్బ్. నేపథ్య సంగీతం, అధిక్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే, కొన్నిసార్లు స్టోరీ స్లో అయినట్లు ఉంటుంది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్!!

ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'పర్సనల్ గా నాకు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఎక్కువగా నచ్చింది. అందులో ఒక హై సీక్వెన్స్ తర్వాత మరొకటి మాస్ ఎలివేషన్లు & ఫన్ బ్యాలెన్స్ చేస్తూ సాగడం బాగుంది. ఫ్లాష్‌బ్యాక్ అనేది దర్శకుడు అధిక్ నుండి వచ్చిన ఒక క్రేజీ ఫ్యాన్‌బాయ్ సంభవం' అంటూ కామెంట్ చేశాడు.