Ajith Kumar: నెల రోజుల గ్యాప్‌‌‌‌తో..అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్

Ajith Kumar: నెల రోజుల గ్యాప్‌‌‌‌తో..అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్

కోలీవుడ్ స్టార్ అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో మగిళ్‌‌‌‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విడాముయర్చి’ ఒకటి.  దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ గతంలో చెప్పారు.

అయితే డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్‌‌‌‌ చేస్తున్నట్టు ఇందులో కీ రోల్ చేస్తున్న అర్జున్.. ఇటీవల సైమా ఈవెంట్‌‌‌‌లో చెప్పారు. దీంతో ఇయర్‌‌‌‌‌‌‌‌ ఎండింగ్‌‌‌‌కి అజిత్‌‌‌‌ సినిమా కన్‌‌‌‌ఫర్మ్ అని ఆనందపడ్డారు ఫ్యాన్స్. అయితే అజిత్ మరో సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి రాబోతోంది.

అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌ సంస్థ నిర్మిస్తోంది. మంగళవారం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. మరోసారి రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను కన్‌‌‌‌ఫర్మ్ చేశారు.

నిజానికి అజిత్ లాంటి స్టార్ హీరో నుంచి వచ్చే రెండు సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్‌‌‌‌ ఉండటం కామన్.  కానీ ఈ రెండు చిత్రాలు నెల రోజుల గ్యాప్‌‌‌‌తో రాబోతున్నాయి. మరి ఇదే రిలీజ్‌‌‌‌ డేట్స్‌‌‌‌కు ఫిక్స్ అవుతారా... లేక మరేదైనా మార్పులు జరగనున్నాయో చూడాలి!