GoodBadUgly: అజిత్ ఫుల్ యాక్షన్ మోడ్.. గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్, అడ్వాన్స్ బుకింగ్ అప్డేట్

GoodBadUgly: అజిత్ ఫుల్ యాక్షన్ మోడ్.. గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్, అడ్వాన్స్ బుకింగ్ అప్డేట్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో USA ప్రీమియర్లు ఏప్రిల్ 9న వేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను USAలో ప్రత్యంగిర సినిమాస్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా USA ప్రీమియర్ షోల బుకింగ్స్ మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రేపు (ఏప్రిల్ 3న) విడుదల కానుందని టాక్. అజిత్ నటన, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 4న తమిళనాడు అంతటా రాత్రి 8:02 గంటలకు అడ్వాన్స్ బుకింగ్స్ షురూ కానుందని సమాచారం. తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఈ వీక్ లోనే మొదలవ్వనుంది. 

ఇకపోతే హీరో అజిత్ కుమార్ ఈ మధ్యే పట్టుదల (విదాముయర్చి) మూవీతో వచ్చి ఫ్లాప్ తో ప్రేక్షకులని నిరాశపరచాడు. ఇక ఇప్పుడు పవర్ ఫుల్ యాక్షన్ తో వస్తుండటంతో గుడ్ బ్యాడ్ అగ్లీపై అంచనాలు మొదలయ్యాయి. టైటిల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పినట్టుగానే అజిత్ని మూడు విభిన్న షేడ్స్‌తో చూపిస్తున్నారు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran).

ALSO READ : DivyaBharathi: పెళ్ళైన వ్యక్తితో అసలు చేయను.. హీరోతో డేటింగ్‌పై స్పందించిన నటి దివ్యభారతి

పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, త్రిష హీరోయిన్గా నటించింది. ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, షైన్ టామ్ చాకో మరియు రఘు రామ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఎలాంటి మాస్ ఫీస్ట్ ఇవ్వనున్నాడో చూడాలి.