VidaaMuyarchi: న్యూ ఇయర్ వేళ అజిత్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. విదాముయార్చి రిలీజ్ వాయిదా

VidaaMuyarchi: న్యూ ఇయర్ వేళ అజిత్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. విదాముయార్చి రిలీజ్ వాయిదా

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్‌(Ajith Kumar).. సినిమాలంటే తెలుగు ఫ్యాన్స్ లో కూడా సూపర్ క్రేజ్. అతని నుంచి ఓ సినిమా వస్తుందంటే.. తమిళ ఫ్యాన్స్ ఎలా ఎదురుచూస్తారో.. తెలుగు ఫ్యాన్స్ కూడా అదేమాదిరిగా ఉంటారు. ఇప్పుడు అజిత్ నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి విదాముయార్చి, మరొకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. 

అయితే.. విదాముయార్చి (VidaaMuyarchi) మేకర్స్ నుంచి ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ వచ్చింది. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన విదాముయార్చి  సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ, డేట్ అనౌన్స్ చేయలేదు. దాంతో సినిమా విడుదలపై ఫ్యాన్స్లో సందేహం మొదలైంది. ఇక ఎట్టకేలకు క్లారిటీ ఇస్తూ.. తాజాగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ నోట్ రిలీజ్ చేసింది. 

Also Read : టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

"అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025! .. అనివార్య కారణాల వల్ల పొంగల్‌కి విడతాముయార్చి విడుదల వాయిదా! తదుపరి కొత్త డేట్ కోసం దయచేసి వేచి ఉండండి! వేచి ఉండటం చాలా విలువైనదేని" అధికారకంగా ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాంతో అజిత్ ఫ్యాన్స్కి భారీ షాక్ ఇచ్చినట్టు అయింది. ఈ సినిమాలో అజిత్ కుమార్ సరసన చెన్నై బ్యూటీ త్రిష నటిస్తోంది.  అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. 

ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ విషయానికి వస్తే.. టాలీవుడ్ టాప్ బ్యానర్..స్టార్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు ఈ మూవీని నిర్మిస్తున్నారు. టైటిల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పినట్టుగానే అజిత్ని మూడు విభిన్న షేడ్స్‌తో చూపిస్తున్నారు.

డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) స్టైల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025లో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.