Ajith kumar:మే 1న సోషల్ మీడియాలో సునామీ ఖాయం

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith kumar) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన లాస్ట్ మూవీ "తునీవు"(Thunivu)తో కెరీరి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. బ్యాంకు రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్నే అందుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 230 కోట్లు కొల్లగొట్టింది.

దీంతో అజిత్ చేయబోయే తరువాత సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట అజిత్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని.. లైకా(Lyca produc) సంస్థ నిర్మిస్తుండగా.. మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మే 1న అజిత్ కుమార్ బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా అఫీషియల్ గా మొదలుకానుంది.

అజిత్ బర్త్ డే రోజున AK 62 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి, వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లిపోవడానికి లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తుందట. ఈ వార్త బయటకి రావడంతో అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో AK 62 ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే 1న అజిత్ బర్త్ డే రోజు AK 62 అనౌన్స్మెంట్ ని ఫాన్స్ కలిపి ఏ రేంజులో సెలబ్రేట్ చేస్తారో చూడాలి మరి.