Pattudala X Review: అజిత్ పట్టుదల X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Pattudala X Review: అజిత్ పట్టుదల X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ పట్టుదల (తమిళ టైటిల్- విదామయూర్చి). ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 6న) పాన్ ఇండియా స్థాయిలో థియేట‌ర్ల‌లో రిలీజైంది. హాలీవుడ్ మూవీ బ్రేక్‌డౌన్ ఆధారంగా పట్టుదల మూవీ రూపొందింది.

మ‌‌గిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. అజిత్‌‌కు జంటగా త్రిష నటించిన ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందో X రివ్యూలో చూద్దాం. 

పట్టుదల రిలీజ్ సందర్భంగా, హీరో  సాయి ధరమ్ తేజ్ X ఖాతాలో బెస్ట్ విషెష్ చెప్పాడు. "అజిత్ సార్, మీ అద్భుత విజయాన్ని తెర బయట చూశాను. ఇప్పడు వెండితెరపై కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. విదాముయార్చి మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అని తెలిపాడు. 

పట్టుదల కథ విషయానికి వస్తే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ కపుల్‌కి కొన్ని అనివార్య కారణాల వల్ల మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి సిద్దపడతారు. వక్తులే వేరుంగా ఉంటారు కానీ.. వాళ్ల మనసులు మాత్రం ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటాయి. దీంతో ఈ జంట విడిపోవడానికి డిసైడ్ అవుతారు. కానీ, ఓ అనూహ్య సంఘటన వారిని మరింత దగ్గరయ్యేలా చేస్తుంది.

అంతలోనే భార్య కిడ్నాప్ కావడంతో ఆమెను రక్షించుకోవడానికి ఆ హీరో చేసాడు? అసలు వీరి మధ్య గొడవలు మొదలవ్వడానికి కారణాలేంటీ? ఒక్కటవ్వటానికి ఎదురైన సంఘటన ఏంటీ? అంతలోనే అతని భార్యను కిడ్నాప్ చేసేందేవరు? తిరిగి ఆమెను హీరో ఎలా రక్షించుకున్నాడు? అనేది పట్టుదల కథ.

పబ్లిక్ టాక్ విషయానికి వస్తే..

ఫ‌స్ట్ హాఫ్‌లో అజిత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. అజిత్‌, త్రిష కాంబోలో వ‌చ్చే సీన్స్ బాగుంటాయ‌ట‌. ఇక ఈ సినిమా స్టార్ట్ ఐనా ఫస్ట్ 20 నిముషాలు స్లో పేజ్ స్టార్ట్ అయి ఎంగేజ్ చేసే సీన్స్ ఉంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్టాఫ్ లవ్ సీన్స్, సెకండాఫ్ యాక్షన్స్ సీన్స్ తో సినిమా అదిరిపోయిందని కొందరు చెబుతున్నారు. విలన్ గా నటించిన అర్జున్ సినిమాలో భారీ హైప్ ఇచ్చాడని చెబుతున్నారు. ముఖ్యంగా అజిత్, అర్జున్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

ఇంట‌ర్వెల్ బ్లాక్ ఫైట్ సీన్, అజిత్, అర్జున్ ట్రైన్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ సినిమాలో మేజర్ హైలైట్ అనే టాక్ వినిపిస్తోంది. ఇక సెకండాఫ్ అక్కడక్కడ కాస్త మెప్పించిందని.. ఇంకాస్తా బెటర్ గా ఉండే బాగుండు అనే ఫీలింగ్ ఇచ్చినట్లు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. 

అర్జున్ స్క్రీన్ ప్ర‌జెన్స్, క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉన్నాయ‌ని, త్రిష రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎప్పటిలాగే తన బీజీఎమ్‌తో సినిమాకు హై యాక్ష‌న్ ఫీల్‌ను తీసుకొచ్చాడ‌ని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 

ఇకపోతే కొంతమంది కథలో వేగం లేదని చాలా నెమ్మదిగా చెప్పారని విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా  కమర్షియల్ ఎలిమెంట్స్‌ కోసమే దర్శకుడు ప్లాన్‌ చేసుకున్నాడని అంటున్నారు.