హీరో అజిత్ కార్ యాక్సిడెంట్.. సేఫ్ గా బయట పడ్డాడా..?

హీరో అజిత్ కార్ యాక్సిడెంట్.. సేఫ్ గా బయట పడ్డాడా..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న హై-స్పీడ్ రేసింగ్ ఈవెంట్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే హీరో అజిత్ మరోసారి రేసింగ్ ఈవెంట్ లో పాల్గొంటూ కారు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం వాలెన్సియాలో జరిగిన హై-స్పీడ్ రేసింగ్ ఈవెంట్, పోర్స్చే స్ప్రింట్ ఛాలెంజ్ లో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. కానీ అజిత్ మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సేఫ్ గా బయటపడ్డాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ యాక్సిడెంట్ సమయంలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అజిత్ నడుపుతున్న కారు రేస్ ట్రాక్ పై మరో వాహనాన్ని ఢీకొన్న తర్వాత   అనేకసార్లు పల్టీలు కొట్టినట్లు పల్టీలు కొడుతూ కనిపించింది. అయితే ఈ మధ్య హీరో అజిత్ రేసింగ్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నాడు. కాగా గడిచిన రెండు నెలల వ్యవధిలోనే 3 సార్లు కారు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా బయట పడ్డాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా తమిళ్ ప్రముఖ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజిత్ కి జంటగా తమిళ్ బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష నటిస్తుండగా అర్జున్ దాస్, ఎస్జె సూర్య, ప్రభు, సునీల్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.