స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ పట్టుదల (తమిళ టైటిల్- విదామయూర్చి). ఈ మూవీ రేపు (ఫిబ్రవరి 6న) పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అజిత్‌కు జంటగా త్రిష నటిస్తోంది. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, సీడెడ్ లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ దగ్గర పడుతున్న సౌండ్ అంతగా లేనేలేదు.. అంచనాలు ఎక్కువ ఎట్లా అంటారా? అందుకు కారణం లేకపోలేదు. హీరో అజిత్ కుమార్ కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి.
అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు పులిష్టాప్ పడింది. అందుకు తగ్గట్టుగానే రిలీజైన టీజర్, ట్రైలర్ విజువల్స్ ఆసక్తి పెంచాయి. అయితే, ఈ సినిమాకు సోషల్ మీడియాలో పెద్దగా ఎవరు చర్చించుకోకపోవడం వసూళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read :- సినిమా సెట్లో ప్రమాదం.. కాలిన గాయాలతో యంగ్ హీరో
అంతేకాకుండా, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే టిక్కెట్లు కూడా పెద్దగా బుక్ అవ్వలేదని టాక్. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటి రూపాయల ఓపెనింగ్స్ కూడా అందుకోవడం కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ హీరో అజిత్ కు తెలుగులో మార్కెట్ ఉందా? లేదా ? అనేది రేపు తెలుస్తోంది.
Every effort paves the way to triumph! 💪 VIDAAMUYARCHI is all set to storm in cinemas from tomorrow! 🔥 Witness perseverance in action! 🤩
— Lyca Productions (@LycaProductions) February 5, 2025
FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions… pic.twitter.com/5pLxXMOoFa
బడ్జెట్&బుకింగ్స్:
పట్టుదల మూవీని సుమారుగా రూ.350 కోట్ల రూపాయలతో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ మూవీ ఇండియాలో దాదాపు 2700 థియేటర్స్లో పైగా విడుదల అవుతుంది. తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అదరగొడుతోంది. ప్రస్తుతం 1000 కిపైగా స్క్రీన్లలో రూ.3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ దాటి పరుగులు పెడుతుంది.
అమెరికా, యూఏఈ, మలేషియాలో సైతం అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్ములేపుతోంది. మలేషియాలో ఇప్పటి వరకు 15000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో సుమారుగా 5 లక్షల రూపాయలు వసూలైనట్టు సమాచారం.
ఈ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమెరికా రూ.13 లక్షలకి పైగా రాబట్టింది. యూఏఈలో సుమారుగా 6000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 60K డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.7 లక్షలు. దీన్ని బట్టి చూస్తే.. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ దుమ్మురేగాల్సిందే!