ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో ‘వలిమై’

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో ‘వలిమై’

చెన్నై: కరోనా ఎఫెక్ట్ మరో పెద్ద సినిమా మీద పడింది. ఇప్పటికే భారీ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా కూడా వెనక్కి తగ్గింది. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వలిమై సినిమా రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి పండుగకు తమిళ, తెలుగు, హిందీ జనాలను అలరించేందుకు సిద్ధమైన వలిమై పోస్ట్ పోన్ అవ్వడం ‘తల (అజిత్)’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.  

భారీ బడ్జెట్ తో బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించాడు. వలిమైలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఈ మేరకు సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఇప్పుడు అభిమానులకు చిత్ర యూనిట్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. 

మరిన్ని వార్తల కోసం:

మోడీ జీ.. 15 నిమిషాలు ఆగలేరా?

తెలుగు షోలలో ‘అన్‌స్టాపబుల్‌’

నుమాయిష్ పూర్తిగా రద్దు