![అజిత్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2024/07/ajith-looks-superb-in-the-first-look-poster-of-vidaa-muyarchi_WyFUxdguJk.jpg)
కోలీవుడ్ స్టార్ అజిత్‌కు టాలీవుడ్‌లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విడాముయర్చి’. అజిత్ నటిస్తున్న 62వ చిత్రమిది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఆదివారం అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘అతని ఆవేశం మొదలవుతుంది’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లో అజిత్ స్టైలిష్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. అజిత్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్, త్రిష, అర్జున్ తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.