కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం పట్టుదల (తమిళ్ లో విదాముయార్చి). ఈ సినిమాకి తమిళ్ డైరెక్టర్ మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్, బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా నెగిటివ్ షేడ్స్ లో ఉన్నపాత్రల్లో నటిస్తున్నారు. ఓం ప్రకాష్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
గురువారం సాయంత్రం పట్టుదల సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో అజిత్, త్రిష, అర్జున్ వింటేజ్ లుక్ లో కనిపించారు. ముఖ్యముగా ఎక్కువశాతం షూటింగ్ విదేశాల్లో జరగడంతో కొంచెం యాక్షన్స్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో లోకల్ సినిమా ఫీల్ కలగదు. కానీ ఫైట్ సీక్వెన్స్ లో అనిరుద్ ఇచ్చిన బీజియం బాగానే వర్కవుట్ అయ్యిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తే ట్రైలర్ మొత్తం అక్కడక్కడా కొన్ని సీన్లు అతికించినట్లుగా ఉంది.
ALSO READ | Saif Ali Khan: వీడేనంట.. సైఫ్ అలీఖాన్ ను కత్తితో ఆరు పోట్లు పొడిచింది..!
ఈ విషయం ఇలా ఉండగా పట్టుదల చిత్రం ఫిబ్రవరి 06న వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.