దుబాయ్ వేదికగా జరిగిన 24హెచ్ దుబాయ్ కార్ రేసింగ్ పోటీల్లో తమిళ అగ్రనటుడు అజిత్ టీమ్ సత్తా చాటింది. 2025, జనవరి 12న ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో అజిత్ టీమ్ మూడవ స్థానం దక్కించుకుంది. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో బరిలోకి దిగిన నటుడి జట్టు.. ప్రముఖ రేసర్లను వెనక్కి నెట్టి థర్డ్ ప్లేస్ కైవసం చేసుకుంది. రేసింగ్ పోటీల్లో తన జట్టు మూడవ స్థానంలో దక్కించుకోవడంతో హీరో అజిత్ సంబరాలు చేసుకున్నారు. చేతిలో భారత జాతీయ జెండా పట్టుకుని తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. చేతిలో భారత్ జెండా పట్టుకుని అజిత్ చేసిన విన్నింగ్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అజిత్ టీమ్ పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇదే రేసింగ్ పోటీ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా హీరో అజిత్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దుబాయ్‌లో రేసింగ్ ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న సైడ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. 180 కిలో మీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లి అజిత్ సైడ్ వాల్‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో అజిత్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతో హీరో బయటపడ్డాడు. యాక్సిడెంట్ జరిగిన బెదరకుండా అజిత్ మళ్లీ రేసింగ్‌లో పాల్గొన్నాడు.
ALSO READ | కారు రేసింగ్‌లో హీరో అజిత్‌కు ప్రమాదం.. 180 కిలోమీటర్ల స్పీడ్ తో గోడను ఢీకొట్టింది..!
ఈ పోటీలో అజిత్ టీమ్ మూడవ స్థానంలో నిల్చుంది. ప్రమాదం జరిగిన మనోధైర్యం కోల్పోకుండా తిరిగి రేసింగ్‌లో పాల్గొని తన టీమ్ మూడవ స్థానంలో నిలవడంతో అజిత్ పై సర్వత్రా ప్రశంసలు వర్షం కురుస్తోంది. రేస్ లో గెలవడం ఒక ఎత్తైతే.. గెలిచిన అనంతరం భారత జెండా పట్టుకుని అజిత్ చేసిన విన్నింగ్ సెలబ్రేషన్ మరో ఎత్తు. ప్రమాదం జరిగిన జంకకుండా పోటీలో పాల్గొనడంతో పాటు థర్డ్ ప్లేస్‌లో నిలవడంతో అజిత్‌కు రేసింగ్ నిర్వాహకులు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును ప్రదానం చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. అజిత్ ప్రస్తుతం రెండు మూవీల్లో నటిస్తున్నాడు. ‘విదా ముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మూవీల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న విదా ముయార్చి మూవీలో త్రిష హీరోయిన్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. 2025, ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. రేసింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌కు విరామం తీసుకుని అజిత్ దుబాయ్ రేసింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేశాడు.