హైదరాబాద్, వెలుగు: యానిమల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ అజూని బయోటెక్ లిమిటెడ్ రూ. 43.81 కోట్ల రైట్స్ ఇష్యూని మే 21న ప్రారంభించనుంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ప్లాంట్ మెషినరీని కొనుగోలు చేయడానికి, భూమి, సైట్ డెవలప్‌మెంట్‌కు, సివిల్ వర్క్ ఖర్చుల కోసం ఉపయోగిస్తారు.
వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కొంత డబ్బు కేటాయిస్తారు. కంపెనీ రైట్స్ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.ఐదు ఉంటుంది. ఈ నెల 18న క్లోజింగ్ ధరతో పోలిస్తే 20 శాతానికి పైగా తగ్గింపు ఉంటుంది. ఇష్యూ మే 31, 2024 న ముగుస్తుంది. కంపెనీ ప్రమోటర్ గ్రూప్ కూడా రైట్స్ ఇష్యూలో పాల్గొంటోంది.