ఆదివాసీ గ్రామాల్లో అకాడి సంబురాలు

ఆదివాసీ గ్రామాల్లో అకాడి సంబురాలు

ఏజెన్సీ గ్రామాల్లో అకాడి సంబురాలు మొదలయ్యాయి. ఆదివాసీలు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే అకాడి వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి తదితర మండలాల్లోని ఆదివాసీలు ఆదివారం సమీప అడవీ ప్రాంతానికి వెళ్లి వన దైవానికి మహాపూజ చేశారు.

మక్క ఘట్కతో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఊర్లోని ఆవులన్నింటినీ అడవీ ప్రాంతంలో ఊరేగించారు. గ్రామస్తులంతా ఒకచోట చేరి సామూహిక వనభోజనాలు చేశారు. రెండ్రోజులపాటు సాగే ఈ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి.     

వెలుగు, జైనూర్, తిర్యాణి