అకాయ్‌‌‌‌‌‌‌‌ నుంచి కొత్త ఏసీలు

అకాయ్‌‌‌‌‌‌‌‌ నుంచి కొత్త ఏసీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: టీవీలు, ఆడియో, వాషింగ్ మెషీన్లు అమ్మే  ఎలక్ట్రానిక్స్ కంపెనీ  అకాయ్  ఇండియా తాజాగా కొత్త ఎయిర్ కండిషనర్ల (ఏసీల) ను లాంచ్ చేసింది.  మూడు కొత్త సిరీస్‌‌‌‌‌‌‌‌ ఏసీలను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది.  అవి.. అకాయ్ సియాచిన్ (హెవీ డ్యూటీ), అకాయ్ నీల‌‌‌‌‌‌‌‌గిరి (ఎకానమీ), అకాయ్ కాశ్మీర్ (హాట్ అండ్‌‌‌‌‌‌‌‌  కోల్డ్).  

మ‌‌‌‌‌‌‌‌న దేశంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించామని కంపెనీ చెబుతోంది. 1 టన్ను నుంచి 2.25 టన్నుల సామర్థ్యంతో 3-స్టార్, 5-స్టార్ రేటింగ్స్ లో అకాయ్ కొత్త  ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో  8-ఇన్-1 ఫ్లెక్సీ కూలింగ్ మోడ్, ఆయుర్వేద ఫిల్టర్, పీఎం 1 ఫిల్టర్, 4-వే స్వింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏసీల ధరలు  రూ.31 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.