
పద్మారావునగర్, వెలుగు: చిన్న వయస్సులోనే వరుసగా ఓపెన్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తూ చిన్నారి ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోందని హైదరాబాద్లోని యూఎస్కాన్సుల్ జనరల్జెన్నిఫర్లార్సన్ మెచ్చుకున్నారు. దమ్మాయిగూడ పరిధిలోని జవహర్నగర్సేవాభారతి మహిళా శిక్షణ కేంద్రంలో 9వ తరగతి స్టూడెంట్ఆకర్షణ్ఏర్పాటు చేసిన ఓపెన్లైబ్రరీని సోమవారం జెన్నిఫర్లార్సన్ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆకర్షణ 14,600 పుస్తకాలు విరాళాలుగా సేకరించడం గ్రేట్అన్నారు. చిన్నవయస్సులోనే పుస్తకాలతో సమాజంలో పరివర్తన తేవాలనే ఆలోచన చాలా అరుదు అని మెచ్చుకున్నారు. కాగా దమ్మాయిగూడలోని లైబ్రరీలో మొత్తం 600 జనరల్ నాలెడ్జి, తెలుగు ప్రేరణాత్మక కథలు, ఇంగ్లీష్పుస్తకాలు ఉంచినట్లు ఆకర్షణ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్లు, క్యాన్సర్ఆసుపత్రులు, పోలీస్స్టేషన్లు, అనాథాశ్రయాలు, భరోసా కేంద్రం, జువైనెల్హోమ్లు, ఎయిడ్స్బాధిత పిల్లల కేంద్రాల్లో 20 లైబ్రరీలు ఏర్పాటు చేశామని, ఇది 21వది అని చెప్పారు.