రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బెంగాల్ యువ పేసర్ ఆకాష్ దీప్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో భారత స్క్వాడ్ లో ముఖేష్ కుమార్ ను చేర్చారు. అయితే తుది జట్టులో మాత్రం ఆకాష్ దీప్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. సిరాజ్ స్థానంలో వైజాగ్ టెస్ట్ లో అవకాశం దక్కించుకున్న ముకేశ్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బెంగాల్ యువ పేసర్ నాలుగో టెస్ట్ లో ఆడే అవకాశం దక్కింది.
ఎవరీ ఆకాష్ దీప్..?
ఇంగ్లాండ్ తో చివరి 3 టెస్టులకు ఆకాష్ దీప్ భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ ఖాన్ స్థానంలో ఆకాష్ దీప్ కు చోటు దక్కింది. దీంతో తొలిసారి భారత టెస్టు స్క్వాడ్ లో ఈ బెంగాల్ పేసర్ కు అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆసియా గేమ్స్, దక్షిణాఫ్రికా టూర్ కు సెలక్ట్ అయ్యాడు. ఈ 27 ఏళ్ళ పేసర్ ఇంగ్లాండ్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మూడు అనధికారిక టెస్టులలో ఇండియా ఎ జట్టు తరపున తన ప్రదర్శనతో జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసుకొని ఈ సిరీస్‌లో భారత A జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రెండు సార్లు నాలుగు వికెట్లను సాధించాడు.
ఆకాష్ దీప్ అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పటికే భారత టెస్ట్ జట్టులో మరో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గతంలో బెంగాల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
Hailing from Sasaram in Bihar, Akash Deep wanted to play cricket but was discouraged by his father.
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2024
He left for Durgapur with the pretext of finding a job, and found support from his uncle. He went to a local academy where he started gaining prominence for his pace. However,… pic.twitter.com/6QqfXJfjIb