అసలే సిరీస్‍లో వెనుకపాటు.. సిడ్నీ టెస్టులో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. ఇటువంటి ఆలోచనల్లో తలమునకలై ఉన్న టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ అందుతోంది. ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టుకు భారత స్టార్ పేసర్ ఆకాష్ దీప్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ధృవీకరించారు. వెన్ను గాయంతో కర్ణాటక పేసర్ సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడని గంభీర్ పేర్కొన్నారు.
తొలి రెండు టెస్టుల్లో బెంచ్‌కు పరిమితమైన ఆకాశ్ దీప్.. బ్రిస్బేన్, మెల్‌బోర్న్ టెస్టుల్లో బరిలోకి దిగాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 87.5 ఓవర్లు వేసిన ఈ భారత పేసర్.. 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ పని భారమే అతనిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అతిగా బౌలింగ్ చేయడం వల్ల అతనికి వెన్ను నొప్పి వచ్చి ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
Worrying signs for #TeamIndia #INDvAUS #AUSvIND #BGT2025 #akashdeep pic.twitter.com/m7sRZcvgkn
— Crickdom® (@CrickdomOffl) January 2, 2025
ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే.. సిరీస్ సమం చేసుకోవచ్చు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆశలు సంజీవంగా నిలుపుకోవచ్చు. అదే ఓడితే మాత్రం డబ్ల్యూటీసీ ఆశలు ముగిసినట్టే.
ALSO READ | అదీ తెలంగాణ అమ్మాయంటే: అర్జున అవార్డ్‌కు ఎంపికైన దీప్తి జివాంజి