IND vs BAN 2nd Test: ఆకాష్ దీప్ వరుస సిక్సర్లు.. కోహ్లీ బ్యాట్‌తోనూ ప్రమాదమే

IND vs BAN 2nd Test: ఆకాష్ దీప్ వరుస సిక్సర్లు.. కోహ్లీ బ్యాట్‌తోనూ ప్రమాదమే

కాన్పూర్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లో విధ్వంస సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 34.2 ఓవర్లలోనే 285 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బ్యాటర్లందరూ స్థాయికి తగ్గట్టు ఆడి మెరుపులు మెరిపించారు. బౌలర్ ఆకాష్ దీప్ సైతం వరుసగా రెండు సిక్సర్లు కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అతని కొట్టిన సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.

ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో అశ్విన్ వికెట్ పడిన తర్వాత ఆకాష్ దీప్ బ్యాటింగ్ కు వచ్చాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్ లో అతను ఎదుర్కొన్న మొదటి బంతిని స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే తాను ఎదర్కొన్న రెండో బంతిని సిక్సర్ గా మలిచాడు. మూడో బంతిని షార్ట్ బాల్ వేయగా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో కోహ్లీ షాక్ అయ్యాడు. నవ్వుల్లో మునిగిపోయాడు. కోహ్లీ గిఫ్ట్ గా ఇచ్చిన బ్యాట్ తోనే ఆకాష్ సిక్సర్ల వర్షం కురిపించడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ఆకాష్ దీప్ కొట్టిన సిక్సర్లకు కోహ్లీ వైరల్ అయ్యాడు.

ఆకాష్ దీప్ ఇటీవల చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుండి బ్యాట్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. ప్రీ-మ్యాచ్ శిక్షణా శిబిరంలో.. కోహ్లి తన దగ్గర ఉన్న బ్యాట్‌లలో ఒకదానిని ఆకాష్ దీప్‌కి స్వయంగా ఇవ్వడం విశేషం. నేను అమితంగా ఆరాధించే క్రికెటర్లలో కోహ్లీ దగ్గర నుండి బ్యాట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని.. కోహ్లీ ఇచ్చిన బ్యాట్ ను మ్యాచ్‌లో ఉపయోగించనని ఎమోషనల్ అయ్యాడు. అయితే కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తోనే సిక్సర్లు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మొత్తం 5 బంతుల్లో 12 పరుగులు చేసి ఆకాష్ ఔటయ్యాడు.   

ALSO READ | IND vs BAN 2nd Test: దుమ్ము దులిపారు: కాన్పూర్ టెస్టులో టీమిండియా ఐదు ప్రపంచ రికార్డులు

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఓపెనర్ షాదాబ్ ఇస్లాం (7) మోమినుల్ హక్ క్రీజ్ లో ఉన్నారు. జాకీర్ హుస్సేన్ (10), నైట్ వాచ్ మెన్ హసన్ మహమ్మద్ (0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు దూకుడుగా ఆడి భారత్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా 233 పరుగులకు ఆలౌటైంది.