డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) డైరెక్షన్ లో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా డబుల్ ఇస్మార్ట్(Double ismart) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ప్రకటించారు.ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ మూవీలో పూరి వారసుడు..యంగ్ హీరో ఆకాశ్ పూరి( Akashpuri) ఒక స్పెషల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అచ్చమైన తెలంగాణ రోల్ లో కనిపిస్తూ..హైదరాబాద్ గల్లీ గ్యాంగ్ కు లీడర్గా నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్యారెక్టర్ డిజైన్ లో పూరి మార్క్ ఉంటుందని..కామిక్ యాంగిల్తో పాటు.. సీరియస్నెస్ కూడా ఉంటుందని సమాచారం. త్వరలో ఈ క్రేజీ న్యూస్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రామ్కి..ఆకాష్ పూరికి మధ్య వచ్చే సీన్స్ అద్దిరిపోయే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను తీసుకున్నారు..ఇందులో బిగ్ బుల్గా సంజయ్ దత్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.
ALSO READ: కొడుకును కొడుతుంటే తండ్రి ప్రభాస్ ఎంట్రీ.. నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్
పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్నడబుల్ ఇస్మార్ట్ 2024 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాలా సూపర్ సక్సెస్ అవుతుందా..లైగర్ ఫ్లాప్ తో ఉన్న పూరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందిస్తుందా..అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.