నటి పావలా శ్యామలకి ఆర్థికసాయం అందించిన ఆకాష్ పూరీ...

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఆర్ధిక సాయం కోసం ఎదురు చూస్తూ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం తాను, తన కూతురు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని కనీసం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని, ధాతలు దయతలచి సహాయం చెయ్యాలని కోరింది. దీంతో టాలీవుడ్ ప్రముఖ హీరో ఆకాష్ పూరీ స్పందించాడు. ఇందులోభాగంగా పావలా శ్యామల ఉంటున్న వృద్ధాశ్రమానికి వెళ్లి ఆమెని పరామర్శించాడు. అలాగే ట్రీట్మెంట్ కోసం రూ. లక్ష ఆర్థిక సాయం అందించాడు. ఈ సందర్భంగా నటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన గోలీమార్ సినిమాలోని తన పాత్రని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. అలాగే డబ్బు సంపాదించడం గొప్పకాదు.. మంచి మనుషులని సంపాదించడం గొప్పని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, అలాగే మీ నాన్న పూరీ జగన్నాథ్ లా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటూ దీవెనలు అందించింది. దీంతో పూరీ ఆకాష్ చేసిన ఈ పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. అలాగే తన తండ్రి పూరీ జగన్నాథ్ కూడా ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచినంత సహాయం అందించి అడగా నిలిచేవాడని ఆకాష్ పూరీ తండ్రికితగ్గ తనయుడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆకాష్ పూరీ ఆమధ్య రొమాంటిక్, చోర్ బజార్ తదితర సినిమాల్లో నటించాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకే ట్రై చేస్తున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ విషయానికొస్తే గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్. కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన సినిమాకి తగ్గ కొత్త హీరోని వెతికే పనిలో ఉన్నాడు.