తన తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పట్లో నటించను : ఆకాష్ పూరి

తన తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పట్లో నటించను అని చెప్పాడు ఆకాష్ పూరి. హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే ఆయన దర్శకత్వంలో చేస్తానని అన్నాడు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్‌‌‌‌‌‌‌‌కు తను  బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో ఆకాష్ మాట్లాడుతూ ‘ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలనుకుంటున్నా. ఓ లవ్ స్టోరీ తో పాటు కొన్ని యాక్షన్ కథలు విన్నాను. 

అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ఈసారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్  క్యారెక్టర్స్  గురించి ఆలోచి స్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ వంటి మూవీస్ చూసి నప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలి అనే కోరిక కలుగుతుంటుంది. నాన్న రూపొందిస్తున్న  ‘డబుల్ ఇస్మార్ట్’ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది’ అని చెప్పాడు.