Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున ..ఈ వస్తువులు కొంటే బంగారంతో సమానమే..!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున  ..ఈ వస్తువులు కొంటే బంగారంతో సమానమే..!

అక్షయతృతీయ వచ్చిందంటే ఆ రోజు బంగారం షాపులు కిటకిటలాడతాయి.  ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు.  అయితే మధ్య తరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనాంటే చాలా ఇబ్బంది పడతారు.  కొనడానికి తగినంత ఆర్థిక స్థోమత లేక.. కొనకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతారు. అక్షయతృతీయ రోజు ( ఏప్రిల్​ 30) బంగారమే  కొనాల్సిన పనిలేదు.  గోల్డ్​కు బదులుగా మరికొన్ని వస్తువు కొన్నా బంగారంతో సమానమేనని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాం. . .

వైశాఖ మాసంలో  శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు. ఈ రోజున చేసే ఏ శుభ కార్యమైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. పన్నెండు నెలల్లో ప్రతి శుక్ల పక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు. అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు.

బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది. గురువు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది. 'అక్షయ' అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం. అందుకే కొన్ని  వస్తువులు కొనడం శుభఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పత్తి (దూది): అక్షయ తృతీమ రోజున   పత్తిని  కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. ఈ రోజున పత్తి కొనడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు.  దేవుడి పూజకు దీపారాధాన ముఖ్యం.. దీపారాధన కచ్చితంగా పత్తితో వత్తిని తయారు చేయాలి కదా.  ఆ రోజు పత్తిని కొనుగోలు చేస్తే  ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

 వెండి నాణెం :   వెండితో తయారుచేసిన లక్ష్మీదేవి రూపు (నాణెం)  కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. 

మట్టి కుండ  : అందరికి  అందుబాటులో ఉండే ఈ వస్తువు ధనసంపదకు చిహ్నంగా నిలుస్తుంది. దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. మట్టి కుండ, గిన్నె, ప్రమిద, ఇలాంటి  మట్టి పాత్రలను అక్షయ తృతీయ  రోజున కొనుగోలు చేయవచ్చు   బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొంటే  బంగారం కొన్నట్లే నని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అందుకే పూర్వం ఎంత సంపద ఉన్నవారైనా మట్టి కుండలనే ఉపయోగించేవారు. 

 కొత్త దుస్తులు:  అక్షయ తృతీయన కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు.

పుస్తకాలు :  విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఆ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం

రాగి, ఇత్తడి పాత్రలు : శుభప్రదమైన లోహాలైన రాగి, ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనడం సౌభాగ్యానికి దారి తీస్తుందని పెద్దలు చెబుతారు.

రాతి ఉప్పు:  ఆ  రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు. అయితే ఆ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి.

బార్లీ లేదా పసుపు ఆవాలు:  అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి. బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం, వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు.

గవ్వలు :అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ దేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలను అంటే చాలా ఇష్టం. ఈ రోజున, 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీ దేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం