ICC T20 rankings: టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా వెస్టిండీస్ స్పిన్నర్

ICC T20 rankings: టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా వెస్టిండీస్ స్పిన్నర్

వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకేల్ హోసేన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. బంగ్లాదేశ్ తో ఇటీవలే జరిగిన టీ20 సిరీస్ లో హుస్సేన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు టీ20లు విండీస్ ఓడిపోయినా  అకేల్ హోసేన్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ సిరీస్ కు ముందు నాలుగో స్థానంలో ఉన్న ఈ విండీస్ స్పిన్నర్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ కు చేరుకున్నాడు. 

టాప్ ర్యాంక్ లో ఉన్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్‌ జంపా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 4 లో స్పిన్నర్లు ఉండడం విశేషం. బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ టాప్ లో కొనసాగుతున్నాడు. పిల్ సాల్ట్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ALSO READ | Virat Kohli: మెల్‌బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో మహిళా జర్నలిస్ట్‌పై కోహ్లీ అసహనం 

టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు రూట్ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన చివరి టెస్టులో రూట్ తొలి ఇన్నింగ్స్ లో 32.. రెండో ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేసి టాప్ కు చేరుకున్నాడు. మరోవైపు మూడో టెస్టులో బ్రూక్ విఫలం కావడంతో అతను రెండో ర్యాంక్ కు పడిపోయాడు. భారత ఆటగాళ్లలో జైశ్వాల్ నాలుగో ర్యాంక్.. పంత్ 9 ర్యాంక్ లో ఉన్నారు.