Akhanda 2 Shooting Update: మహా కుంభమేళాలో అఖండ 2 తాండవం..

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన  ‘అఖండ’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌‌‌‌గా ‘అఖండ 2’ రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌లోని ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీలో షూటింగ్ స్టార్ట్ చేయగా, కొత్త షెడ్యూల్‌‌‌‌ను మహా కుంభమేళాలో మొదలుపెట్టారు.  కీలకమైన సన్నివేశాలని మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది మూవీ టీమ్.  

తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి  కాంబినేషన్‌‌‌‌లో తెరకెక్కు తోన్న  నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.  దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.