మహా కుంభమేళాలో తొక్కిసలాట....అమృత స్నానాలు నిలిపివేత

మహా కుంభమేళాలో తొక్కిసలాట....అమృత స్నానాలు నిలిపివేత
  • మహా కుంభమేళాకు భారీగా భక్తులు
  • ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జనవరి  29న మౌని అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. అయితే అమృత స్నానాలకు రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికి గాయాలు. దీంతో అమృత స్నానాలను నిలిపివేస్తున్నట్లు అఖాడ పరిషత్ ప్రకటించింది.  ఈ ఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎం యోగికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా బుధవారం ( జనవరి 29) తెల్లవారు జామున అమృత స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.. ఒక్కసారిగా తోపులాట జరగడంతో భక్తులు కిందపడటంతో గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. దాదాపు పదిమంది మరణించి ఉంటారని సుమారు 50మంది భక్తులు గాయపడి ఉంటారని యూపీ మీడియా చెబుతోంది.  ప్రయాగ్ రాజ్ సెక్టార్ 2 వద్ద బుధవారం తెల్లవారు జామున తొక్కిసలాట జరిగింది. బారీకేడ్డు విరిగిపడటంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 


మహాకుంభమేళాలో తొక్కిసలాటతో యూపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. సహాయక చర్యలు చేపట్టింది.  తొక్కిసలాటలో గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. 

ALSO READ | మహా కుంభ మేళాలో తొక్కిసలాట..50మందికి తీవ్రగాయాలు..సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్