
తెలుగులో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ సినిమా ఎట్టకేలకి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సినిమా 2023లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. ఈ సినిమాలో హీరో అఖిల్ పవర్ఫుల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించాడు. మలయాళ నటుడు మమ్ముట్టి, సాక్షి వైద్య, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సత్య తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా స్టార్ సినీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించారు. దాదాపుగా 85 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించి తీసిన ఈ సినిమా పట్టుమని పది కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. దీంతో దర్శక నిర్మాతలకి భారీ నష్టాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఏజెంట్ సినిమా రిలీజ్ రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఓటీటీ అప్డేట్ మాత్రం రాలేదు. ఇటీవలే మేకర్స్ ఏజెంట్ సినిమాని ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మార్చ్ 14నుంచి ఏజెంట్ సినిమా సోనీ లివ్ లో ప్రసారం కానుంది. తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ్, మలయాళం తదితర పాన్ ఇండియా భాషల్లో డబ్ చేశారు. దీంతో థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయినవారు ఓటిటీలో చూసెయ్యండి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అఖిల్ తెలుగులో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ఫేమ్ డైరెక్టర్ మురళీ కిశోర్ డైరెక్ట్ చేస్తున్నరూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.. ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. డైరెక్టర్ మురళీ కిశోర్ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.