వరంగల్ పోరాటాలకు అడ్డా అని, వీరత్వానికి ఇంటి పేరని, అందుకే దీన్ని వైల్డ్ వరంగల్ అంటారన్నారు నాగార్జున. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా వరంగల్‌లో ప్రీ రిలీజ్‌లో ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ..‘వరంగల్ విజయాలకు అడ్డా, ‘ఏజెంట్’ తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ ‘కొత్త జానర్‌తో మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా సరికొత్త స్పై సినిమాను రూపొందించారు. బ్లాక్ బస్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అఖిల్ స్టన్నింగ్ విజువల్స్ చూస్తారు. తన ఎనర్జీ ని ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సాక్షి బ్యూటీఫుల్ హీరోయిన్. తనకి మంచి భవిష్యత్ ఉంటుంది. మమ్ముట్టి కథ ఒప్పుకున్నారంటే అది మామూలుగా ఉండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారంటే అది పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది’ అన్నారు.
ఈ సినిమా చాలా క్రేజీగా ఉంటుంది అన్నాడు అఖిల్. ఇందులో నటించడం హ్యాపీ అంది సాక్షి వైద్య. ‘ఏదో చేయాలి.. ఏదో సాధించాలనే కసి అఖిల్‌లో చూశాను’ అని చెప్పాడు సురేందర్ రెడ్డి. అనిల్ సుంకర మాట్లాడుతూ ‘ఈ సినిమాతో అఖిల్ పెద్ద స్టార్ అవుతాడు. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఇది నా ప్రామిస్’ అన్నారు.