మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ తర్వాత అఖిల్, సైరా నరసింహారెడ్డి మూవీ తర్వాత సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయిన అఖిల్..స్టైలిష్ లుక్ తో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
An Action Spectacle awaits you in theatres ?
— SurenderReddy (@DirSurender) March 11, 2022
THE WILD ONE??#AGENT⚡️ Reporting in theatres from AUGUST 12th 2022 ???#AGENTonAugust12 ?@AkhilAkkineni8 @mammukka @AnilSunkara1 @hiphoptamizha @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/K757C6GCjD
హాలీవుడ్ సూపర్ హిట్ బార్న్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మనాలీలో జరుగుతోంది. అక్కడ హై యాక్టేన్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. మనాలీలో భయపెట్టించే యాక్షన్ ఎపిసోడ్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నాం..ఈ సారి హిట్ కొట్టేందుకు శ్రమిస్తున్నామంటూ సురేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.ఇక ఈ మూవీని అగష్టు 12న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూవీలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమీజ సంగీతం అందిస్తుండగా..అనిత్ సుంకరతో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
మరిన్ని వార్తల కోసం
ఆ ఊరి అబ్బాయిలకు పెళ్లి కష్టాలు
కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి