
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇంట్రెస్టింగ్ రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిశోర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అక్కినేని నాగ చైతన్య, నాగార్జున మనం ఎంటర్ ప్రైజస్, సితార బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ X వేదికగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
అఖిల్ హీరోగా నటిస్తోన్న 6వ మూవీ అప్డేట్ రానుంది. రేపు మంగళవారం (08.04.25న) అఖిల్ పుట్టినరోజు సందర్భంగాటైటిల్ గ్లింప్స్ విడుదల కానుందని నాగవంశీ ట్వీట్ చేశాడు. ఈ మేరకు సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో "ప్రేమ కంటే యుద్ధం ఎక్కువ హింసాత్మకం కాదు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
భయపెట్టేలా ఈ ప్రీ-లుక్ పోస్టర్ ఉంది. అలాగే పోస్టర్ మీద ఉన్న పదాలు సినిమా కథాంశంపై ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టర్ ద్వారా ప్రేమ మరియు ఆవేశాన్ని స్పష్టంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీకి 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ ఉంది. మరి రేపు రాబోయే అప్డేట్తో టైటిల్ అండ్ సినిమా కథపై ఓ స్ప్రష్టత రానుంది.
#Akhil6 - Title glimpse unveils on 08.04.25 ❤️🔥 @AkhilAkkineni8 @iamnagarjuna @KishoreAbburu @AnnapurnaStdios #ManamEntertainments @SitharaEnts pic.twitter.com/hzWltjRPsk
— Naga Vamsi (@vamsi84) April 7, 2025
అయితే, దర్శకుడు మురళి అనంతపురం రూరల్ బ్యాక్ డ్రాప్ కథతో నాగ్‌ను మెప్పించినట్లు టాక్. ఈ సినిమాలో అఖిల్ పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాకుండా న్యాయం కోసం పోరాటం చేస్తూ తన వాళ్ళని ఫ్యాక్షనిజం నుంచి ఎలా రక్షించాడనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రానున్నట్లు సమాచారం. సరిగ్గా ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం, తన వాళ్ళ తరుపున న్యాయం కోసం పోరాటం చేసేలా ఉంది.
ఇక అఖిల్ ప్రీవియస్ సినిమా విషయానికి వస్తే..భారీ బడ్జెట్తో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ (Agent)బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దీంతో అఖిల్ కెరీర్ మళ్ళీ డైలమాలో పడింది.నిజానికి ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అఖిల్ లో ఉన్నాయి కానీ,టైం కలిసిరావడం లేదు అంతే.ఒక్క హిట్టు..ఒకేఒక్క హిట్టు పడితే మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయం అనే చెప్పాలి.మరి ఇప్పుడు చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలతో అయిన అఖిల్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.