
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కి మంచి కటౌట్ ఉన్నప్పటికీ సరైన కంటెంట్ పడకపోయేసరికి హిట్ పడలేదు. దీంతో ఇప్పటిఓవరకూ 6 సినిమాల్లో హీరోగా నటించినా ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి కథల ఎంపిక విషయంలో కొంతమేర టైమ్ తీసుకుని మంచి సాలిడ్ మాస్ డ్రామా బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫ్యాన్స్ ని అలరించేందుకు రెడీ అవుతన్నాడు.
ప్రస్తుతం అఖిల్ కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ఫేమ్ డైరెక్టర్ మురళీ కిశోర్ అనంతపురం రూరల్ బ్యాక్ డ్రాప్ కథతో నాగ్‌ను మెప్పించినట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ పల్లెటూరి యువకుడి పాత్రలో నటించడమేకాకుండా న్యాయం కోసం పోరాటం చేస్తూ తన వాళ్ళని ఫ్యాక్షనిజం నుంచి ఎలా రక్షించాడనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రానున్నట్లు సమాచారం.
►ALSO READ | పరిచయం : ప్రతిసారి కొత్త పాత్ర చేయాలన్నదే నా కోరిక : దీక్షిత్ శెట్టి
ఈ మూవీకి 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే కొడుకు హిట్ కోసం ఈసారి హీరో నాగార్జున రంగం లోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో అన్నపూర్ణ పిక్చర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా ని నిర్మించడమే కాకుండా స్క్రిప్ట్, మేకింగ్ ఔట్ ఫుట్ ఇలా ప్రతీది దగ్గరుండి చూసుకునేట్లు ప్లాన్ చేస్తున్నాడట. హిట్ లేక సతమతమవుతున్న అఖిల్ కి మురళీ కిశోర్ అయినా బ్రేక్ ఇస్తాడో లేదో చూడాలి..