రియల్ లైఫ్‌లో తనకొక గాళ్ ఫ్రెండ్ ఉందంటున్న అఖిల్... రిలేషన్ షిప్‌లో, మ్యారీడ్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లెమ్స్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో సొల్యూషన్ చెబుతానంటున్నాడు. తను హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకులు ముందుకొస్తున్న సందర్భంగా అఖిల్ చెప్పిన ముచ్చట్లు..
‘బొమ్మరిల్లు’ తీసి పదిహేనేళ్లు అయినా భాస్కర్ ఇప్పటికీ యూత్‌లానే ఆలోచిస్తారు. అందుకే ఈ సినిమా సెంటిమెంట్స్, ఎమోషన్స్, డైలాగ్స్ విషయంలో ఎక్కడా అవుట్ డేటెడ్‌గా అనిపించదు. రొమాన్స్ అనేది ఫిజికల్ టచ్ ఒకటే కాదు. చాలా దారుల్లో రొమాన్స్‌ని చూపించొచ్చు అంటారు. బర్త్‌డే విషెస్‌కి గ్రీటింగ్ కార్డ్ రాసినా, పర్సనల్‌గా వెళ్లలేక ఫ్లవర్స్ పంపినా అందులోనూ రొమాన్స్ ఉంటుంది. ఇలాంటి చాలా విషయాలను అందంగా చెప్పారు భాస్కర్. గ్యాప్ రావడం వల్ల ఆయన తగ్గారని నేను అనుకోను. నాకేమీ కంటిన్యూయస్ బ్లాక్ బస్టర్స్ రావడం లేదుగా.
అరవింద్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటివారు. తన ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకున్నారు. బన్నీ వాస్ ఎంతో కేర్ తీసుకున్నారు. స్టోరీ సెలక్షన్‌తో పాటు ఎడిటింగ్‌లో నాన్న ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఫైనల్ కాపీ చూశాక ఇంత హిలేరియస్ మూవీ ఈ మధ్యకాలంలో చూడలేదన్నారు. సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఎంతవరకు ప్రయత్నించామనేదే ముఖ్యం. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాం. ఎలాంటి కమర్షియాలిటీస్‌కు వెళ్లకుండా కథకు ఏం కావాలి, ఎంత కావాలో అదే చేశాం. ప్రస్తుతం ‘ఏజెంట్’ షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. మేజర్ షెడ్యూల్‌కి అబ్రాడ్ వెళ్తున్నాం. కరెక్ట్ టైమ్ చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. నా కెరీర్‌ను స్పీడ్ చేద్దామనుకునే టైమ్‌లో కరోనా వచ్చింది. ఇకనైనా మరింత వేగం పెంచాలనుకుంటున్నా. కంటిన్యూయస్‌గా కథలు వింటూన్నా. నెక్స్ట్ రెండేళ్ల వరకూ లైనప్ ఉంది. ఏది ఎప్పుడు చేస్తామనేది త్వరలోనే చెబుతాను. బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసే ఆలోచన లేదు. నేను తెలుగు హీరోని. ఇక్కడే ఉంటాను.. ఇక్కడే సినిమాలు చేస్తాను.
యంగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియెన్స్ కూడా ఓపెన్ మైండ్‌తో, ఫార్వార్డ్ థింకింగ్‌తో చూడాలి. పూజా హెగ్డే డైలాగ్స్ చాలా స్పైసీగా ఉంటాయి. బయటకు చెప్పలేక లోపల మాట్లాడుకునే ఇష్యూస్‌ని సినిమాలో డీల్ చేశాం. అలాగని ఫ్యామిలీతో చూసినా ఏమాత్రం వల్గారిటీగా ఉండదు. ప్లెజెంట్‌గా చూడొచ్చు.