
Akhil LENIN Title Glimpse: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ఫేమ్ డైరెక్టర్ మురళీ కిశోర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా "లెనిన్". ఈ సినిమాని డైరెక్టర్ మురళీ కిషోర్ విలేజ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత అన్నపూర్ణ పిక్చర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నాడు
మంగళవారం హీరో అఖిల్ పుట్టున రోజు కావడంతో లెనిన్ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో అఖిల్ పల్లెటూరి యువకుడి పాత్రలో మాస్ లుక్ లో కనిపించాడు. హీరోయిన్ శ్రీలీల కూడా విలేజ్ గర్ల్ లుక్ లో డీసెంట్ గా కనిపించింది. ఇక "మా నాయన ఒకటే చెప్తుండె.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా ... పేరు ఉండదు.. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. కానీ పేరుంటాది.." అంతో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని విజువల్స్ కూడా అలరించాయి. ఓవరాల్ గా చూస్తే ఈసారి అఖిల్ కి హిట్ పడినట్లేనని తెలుస్తోంది. అయితే పలువురు నెటిజన్లు, అభిమానులు లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ హీరో అఖిల్ కి బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
Also Read : ఇక నుంచి శివ నామ స్మరణ కాదు.. శవ నామ స్మరణ అంటూ..
ఈ విషయం ఇలా ఉండగా హీరో అఖిల్ కి మంచి కటౌట్ ఉన్నప్పటికీ సరైన కంటెంట్ పడకపోయేసరికి హిట్ పడలేదు. దీంతో ఇప్పటిఓవరకూ 6 సినిమాల్లో హీరోగా నటించినా ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి కథల ఎంపిక విషయంలో కొంతమేర టైమ్ తీసుకుని మంచి సాలిడ్ మాస్ డ్రామా బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫ్యాన్స్ ని అలరించేందుకు రెడీ అవుతన్నాడు.
ఇక డైరెక్టర్ మురళీ కిశోర్ కూడా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. లెనిన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కెరీర్ గేర్ మార్చాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో స్టోర్ నేరేషన్, మేకింగ్ ఇలా ప్రతీది జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.