ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్

ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా అఖిల్ మహాజన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీ గౌస్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ను ఆదిలాబాద్ కు బదిలీ చేసింది.