ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇంటింటికీ తిరిగి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తులో ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్ భర్ ఓ వెరైటీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం టూవీలర్ పై ముగ్గురు ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు.. అయితే తమకు అధికారమిస్తే ఈ రూల్ ఎత్తేస్తామని ఓం ప్రకాశ్ చెప్పారు. తాము గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బైక్ పై ముగ్గురు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
#WATCH | A train carries 300 passengers on 70 seats & doesn't get challans... why's there a challan if 3 people ride a bike? When our govt comes to power, 3 riders will be able to ride a bike for free, otherwise, we'll put challan on jeeps/trains: SBSP founder & chief OP Rajbhar pic.twitter.com/GRdezXPv6C
— ANI (@ANI) February 9, 2022
టూవీలర్స్ పై త్రిబుల్ రైడింగ్ ను సమర్థిస్తూ ఓం ప్రకాశ్ తన వాదనను వినిపించారు. ఒక ట్రైన్ కోచ్ లో 70 సీట్లు ఉంటే 300 మంది ప్రయాణికులను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. మరి ట్రైన్లకు చలాన్ ఎందుకు విధించడం లేదు.. బైక్ పై ముగ్గురు వెళ్తేనే చలాన్ ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. తమ ప్రభుత్వం ఏర్పడితే బైక్ పై ముగ్గురు ప్రయాణించినా చలాన్లు విధించబోమని, లేదా సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణించే జీపులు, రైళ్లపై జరిమానాలు వేస్తామని ఓం ప్రకాశ్ తెలిపారు.