అసెంబ్లీలో భారత క్రికెటర్ షమీపై రచ్చ: కుంభమేళా స్నానంపై పొలిటికల్ వార్

అసెంబ్లీలో భారత క్రికెటర్ షమీపై రచ్చ: కుంభమేళా స్నానంపై పొలిటికల్ వార్

కుంభమేళా పవిత్ర స్నానాలపై యూపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అలహాబాద్ కుంభమేళా నీటిలో మనుషులు చనిపోయేంత బ్యాక్టీరియా ఉందని.. కలుషితం అయిన నీటిలో స్నానం చేయటం వల్ల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్న వార్తలపై రాష్ట్ర అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. కుంభమేళాను పవిత్రంగా నిర్వహించటంలో సీఎం యోగీ ప్రభుత్వం విఫలం అయ్యిందన్న విమర్శల క్రమంలో జరిగిన చర్చలో.. భారత క్రికెటర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. దాంతో, పవిత్ర స్నానాల వ్యవహారం మరో టర్న్ తీసుకుంది.

Also Read :- ప్రిడిక్షన్ చూస్తే నవ్వుకోవాల్సిందే

అసలేం జరిగిందంటే..?

భారత క్రికెటర్ మహమ్మద్ షమీ.. మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర బుధవారం(ఫిబ్రవరి 19) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్నారు. ఇదే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను ఆశ్చర్య పరిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ(2025)లో ఆడేందుకు నాలుగు రోజుల కిందట దుబాయ్ వెళ్లిన షమీ.. ఎప్పుడొచ్చి కుంభమేళాలో స్నానం చేశారని యోగిపై అఖిలేష్ సెటైర్లు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు, ల్యాండ్‌మార్క్‌ల పేరు మారుస్తున్న యోగి ప్రభుత్వం.. బహుషా! క్రికెటర్ పేరు కూడా మార్చేశారేమో అని జోకులు వేశారు.

నిజానికి మహా కుంభమేళాలో స్నానం ఆచరించింది.. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. అతని పేరు మరిచిపోయిన యోగి.. పొరపాటున షమీ స్నానాలు ఆచరించాడని ఉచ్చరించారు. దాంతో, సమాజ్‌వాదీ పార్టీ నేతలకు దొరికిపోయాడు. దీనిపై ఎక్స్(X)లో పెద్ద చర్చే నడుస్తోంది.