లోక్ సభలో నవ్వులు పూయించిన అఖిలేష్, అమిత్ షా.. ఒకరికి మించి మరొకరు పంచులు

లోక్ సభలో నవ్వులు పూయించిన అఖిలేష్, అమిత్ షా.. ఒకరికి మించి మరొకరు పంచులు

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్‎గా సాగుతున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తుటాలు పేలుతున్నాయి. ఇరువర్గాల డైలాగ్ వార్‎తో లోక్ సభ హీటెక్కింది. ఈ క్రమంలో యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోంశాఖ అమిత్ షా మధ్య జరిగిన సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఇప్పటికీ వరకు.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయిందని సెటైర్ వేశారు. అఖిలేష్ వ్యాఖ్యలకు పడి పడి నవ్విన అమిత్ షా ఆ వెంటనే ధీటుగా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ వంటివన్ని కుటుంబ పార్టీలు. ఆ పార్టీల్లో వేరే వాళ్లకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వరు. ఎంతసేపటికీ వారి కుటుంబానికి చెందిన వారే పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ బీజేపీలో మాత్రం అలా ఉండదు. సామాన్య కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వొచ్చు.

Also Read:-వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం

అలాగే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కుటుంబ పార్టీల మాదిరిగా ఉండదు. మేం జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం 12-13 కోట్ల మంది సభ్యులతో కూడిన ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి. కాబట్టి సహజంగానే అధ్యక్షుడి ఎన్నికకు సమయం పడుతుంది. అదే సమాజ్ పార్టీలో ఇలా ఉండదు. ఇంకో 25 సంవత్సరాలు అఖిలేష్ యాదవే ఆ పార్టీ చీఫ్‎గా ఉంటారని నేను చెబుతున్నా’’ అమిత్ షా తనదైన శైలీలో కౌంటర్ ఎటాక్ చేశాడు. అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య జరిగిన సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒక్కసారిగా స్మైల్ ఇచ్చారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర కేబినెట్‎లోకి తీసుకున్నారు. దీంతో 10 నెలలుగా బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‎లో ఉంది. కొత్త పార్టీ ప్రెసిడెంట్ కోసం బీజేపీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల (ఏప్రిల్) చివరికల్లా నడ్డా వారసుడిని ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

आज सदन में मोटा भाई श्री @AmitShah जी ने अखिलेश यादव की धुलाई कर दी।

अखिलेश यादव जी कह रहे थे कि कितनी शर्म की बात है कि BJP जैसी बड़ी पार्टी एक अध्यक्ष नहीं ढूंढ पा रही है। अमित शाह ने 30 सेकेंड के जवाब में मामला निपटा दिया😂😂#WaqfAmendmentBill#waqfamendmentbill2025 pic.twitter.com/Ep6ePDCk4h
— Tarun Rathi (@ITarunRathi) April 2, 2025