
ఏపీ ఎన్నికల్లో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆయన కాంటెస్ట్ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను గెలుచుకున్నారు ఆయన. దీంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబం అంతా ఆనందంలో తేలిపోతున్నారు. కొంతమంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. తండ్రి విజయాన్ని ఆనందిస్తూ.. సెల్యూట్ ది కెప్టెన్ అంటూ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న ఫోటోను షేర్ చేశారు.. ప్రస్తుతం అకిరా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అకిరా చేసిన ఈ పోస్ట్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అకిరా చేసిన ఈ పోస్ట్ ను తల్లి రేణు దేశాయ్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. అకిరా షేర్ చేసిన పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి.. అకిరా తన నాన్న గురించి చేసిన పోస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.