రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న  చిత్రం ‘అక్కడ అమ్మాయి,  ఇక్కడ అబ్బాయి’.  దీపికా పిల్లి హీరోయిన్.   నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.  మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. 

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాయి.   ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, జాన్ విజయ్, ఝాన్సీ, రోహిణి  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ రాయగా, రథన్ సంగీతం అందిస్తున్నాడు. విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో, ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరు పెంచనున్నారు మేకర్స్.