టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్. నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘టచ్‌లో ఉండు’ అంటూ సాగే ఈ పాటను ప్రదీప్, చంద్రిక రవిలపై చిత్రీకరించారు. రధన్ కంపోజ్ చేయగా.. లక్ష్మీ దాస, పి రఘు ఎనర్జిటిక్‌గా పాడారు.
‘టచ్‌లో ఉండు ఓ రబ్బి.. నా టచ్‌లో ఉంటే నిన్నేది టచ్చే చేయదు అబ్బి..’ అంటూ మాస్‌ను ఆకట్టుకునేలా లిరిక్స్ రాశారు చంద్రబోస్. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు.