టాలీవుడ్ యంగ్ హీరో అక్కనేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జైనాబ్ రవడ్జీతో గత కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఇద్దరి కుటుంబ సభ్యులు పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గత ఏడాది నవంబర్ లో నిశ్చితార్థం జరిగింది. అయితే అఖిల్ కుటుంబసభ్యులు వీరివురి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులోభాగంగా మార్చ్ 24న అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి అక్కినేని బంధువులు, సన్నిహితులతోపాటు ఇతర సినీ ఇండస్ట్రీలనుంచి పెద్ద ఎత్తున అతిథులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలు కుటుంబసభ్యులతో కలసి హాజరు కానున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అతిథులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే గత ఏడాది అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య, శోభిత పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి కూడా పెద్ద ఎత్తున సినీ స్టార్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కానీ ఈ పెళ్ళికి ఎటువంటి మీడియా కవరేజ్ లేదా రిపోర్టర్స్ ని అనుమతించలేదు.
ఈ విషయం ఇలా ఉండగా హీరో అఖిల్ కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆమధ్య అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ని దాదాపుగా రూ.85 కోట్లు బడ్జెట్ తో నిర్మించగా కనీసం పట్టుమని రూ.10 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద మొత్తంలో లాస్ వచ్చింది.
ప్రస్తుతం అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రాయలసీమలోని ఓ పల్లెటూరిలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.