Naga Chaitanya wedding Netflix: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూలిపాళ పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి డిసెంబర్ 04న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ పెళ్ళి అతికొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరపాలని అక్కినేని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటూ బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ తదితరులు నాగ చైతన్య పెళ్ళికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే నాగ చైతన్య పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ 50 కోట్లు వెచ్చించి దక్కించుకుందని గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా ఈ పెళ్ళి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లేదా ఇంటర్ నెట్లో సర్కులేట్ చెయ్యకూడదని షరతులు విధించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ సభ్యులు స్పందించారు. ఇందులో భాగంగా నాగ చైతన్య పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి అమ్మినట్లు వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే నాగ చైతన్య పెళ్ళి స్ట్రీమింగ్ రైట్స్ కి సంబందించిన రైట్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టం చేశారు.
Also Read : నయనతారపై ధనుష్ దావా
ఇక ఈ పెళ్ళి ని ప్రయివేట్ గా అతికొద్దిమంది సమక్షంలోజరిగేలా నిర్ణయించుకున్నామని, కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా గాసిప్స్, రూమర్స్ స్ప్రెడ్ చెయ్యకండంటూ కోరారు. దీంతో నాగ చైతన్య ఓటిటి పెళ్ళి రైట్స్ విషయంలో వినిపిస్తున్న వార్తలకి పులిస్టాప్ పడింది.