Naga Chaitanya and Sobhitha Wedding: వివాహ బంధంతో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ

Naga Chaitanya and Sobhitha Wedding: వివాహ బంధంతో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ

Naga Chaitanya and Sobhitha Wedding: టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత శూలిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ స్వర్గీయ నటుడు అక్కనేని నాగేశ్వర రావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈరోజు మూడుముళ్ళ బంధంతో ఈ ఇరువురు ఒక్కటయ్యారు.  నాగ చైతన్య-శోభిత వివాహానికి అక్కినేని కుటుంబసభ్యులతో దాదాపుగా 500మందికి పైగా అతిథులు హాజరయ్యారు.

ఈ పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుటుంబసభ్యులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే టాలీవుడ్ నుంచి టీ సుబ్బరామి రెడ్డి, కీరవాణి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, సుశాంత్, తదితరులు హాజరయ్యారు.

ALSO READ : Aditya 369 Sequel Update: జై బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్ స్టోరీ, హీరో రెడీ.. కొత్త గెటప్ లో

అయితే  శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యుల  విషయనికొస్తే శాంతకామాక్షి,వేణుగోపాలరావుల పెద్ద కూతురు. శోభిత తండ్రి మర్చెంట్ నేవీ లో ఇంజినీర్ గా పని చెయ్యగా, తల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేసేది. శోభిత కి సమంత అనే సోదరి కూడా ఉంది. అయితే శోభిత సినిమాల్లోకి రాకముందు కొంతకాలంపాటూ మోడలింగ్ చేసింది.

గతంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించే సమయంలో వీరిద్దరిమద్య ప్రేమ చిగురించింది. దీంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఆమధ్య నాగచైతన్య శోభితతో ప్రేమ గురించి స్పందిస్తూ ఆమె కేరింగ్ గా ఉంటుందని, ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుందని తెలిపాడు.  అలాగే తమ ఇద్దరి అభిరుచులు కలవడంతో అందుకే తమ ఇద్దరికీ జోడీ కుదిరిందని అభివప్రాయం వ్యక్తం చేశాడు.