పాకిస్తాన్ కు చైతూ వార్నింగ్!

అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సినిమాకు సంబంధించి గ్లింప్స్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. తండేల్ లో నాగ చైతన్య రఫ్ లుక్ కనిపించబోతున్నాడు. బంగాళాఖాతం, ఫిషర్ మెన్ కమ్యూనిటీ నేపథ్యంలో మూవీ కథ ఉండబోతోందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. 

సముద్రంపై వేటకి వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కి జైలు శిక్ష అనుభవించిన ఖైదిగా చైతన్య పాత్ర ఉండనుంది. ఇక నాగచైతన్య పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా చాలా హైలెట్ గా ఉంది. జాతీయా జెండాను తాకుతూ.. 'మా నుంచి విడిపోయిన ఒక ముక్క పాకిస్తాన్.. మీకే అంత ఉంటే.. ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంత ఉండాలి' అని పవర్ ఫుల్  డైలాగ్ తో చైతూ మెప్పించాడు. ఈ సినిమాకి కార్తిక్ కథ అందించగా.. అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.