నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతిని పురస్కరించుకొని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్‌ఆర్-100 కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు వారి జీవితకాల విజయాలు, కృషికి, వ్యక్తులను గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తూ వస్తున్నారు.
ఈ సారి 2024కి గాను ANR జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి అందించనున్నట్లు నాగార్జున (Nagarjuna) ప్రకటించింది తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 25న) స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి.. అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానం అందజేశారు.
ఈ మేరకు నాగ్ ట్విట్టర్ ద్వారా చిరుతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ.. "మా నాన్నగారి ANR 100వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం! మెగాస్టార్ చిరంజీవిని, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లను ఆహ్వానించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ANR అవార్డ్స్ మైలురాయికి గుర్తుగా.. 2024 అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఉంటాయి. అందరు రండి! ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం!" అంటూ తన అభిప్రాయన్ని పంచుకున్నారు.
కాగా ఈ ప్రతిష్ట్మాతకమైన అవార్డును అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకోనున్నారు. బిగ్ బీ అమితాబ్‌ని కూడా నాగార్జున త్వరలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించనున్నారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
ఇకపోతే ANR జాతీయ అవార్డును తొలిసారిగా 2006లో ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు అందించారు.
This year is extra special as we celebrate the 100th birth anniversary of my father, ANR garu! 🎉 Honoured to invite @SrBachchan ji and Megastar @KChiruTweets garu to the ANR Awards 2024 to mark this milestone! 🙏
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2024
Let’s make this award function unforgettable! 🙌… pic.twitter.com/hFylBsEfxq
ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకున్నది వీరే:
2019: రేఖ
2018: శ్రీదేవి
2017: S S రాజమౌళి
2016: గుడిపూడి శ్రీహరి
2014: అమితాబ్ బచ్చన్
2012: శ్యామ్ బెనగల్
2011: హేమ మాలిని
2010: కె. బాలచందర్
2009: లతా మంగేష్కర్
2008: వైజయంతిమాల
2007: అంజలీ దేవి & జయసుధ
2006: షబానా అజ్మీ
2006: దేవ్ ఆనంద్