ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను

త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వస్తారంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా స్పందించారు. గత 15 ఏళ్లుగా ప్రతీ ఎలక్షన్స్ ముందు తను పోటీ చేస్తున్నట్లు గాసిప్స్ వస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. తను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నానని నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ 'ది ఘోస్ట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడారు. 

రాజకీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే త‌న‌కు లేద‌న్న నాగార్జున‌... విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షోతోపాటు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో 'ది ఘోస్ట్' చిత్రంలో నాగ్ నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది.