అక్కినేని(Akkineni) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara rao) కూతురు, నాగార్జున(Nagarjuna) సోదరి నాగ సరోజ(Naga saroja) అనారోగ్యంతో కన్నుమూసారు. ఈ వార్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రోజు అనారోగ్యంతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావుకు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున.. ఐదుగురు సంతానం అన్న విషయం తెలిసిందే.
వారిలో సత్యవతి చాలా ఏళ్ల క్రితమే మరణించగా.. మంగళవారం నాగ సరోజ అనారోగ్యంతో కన్నుమూశారు. మొదటి నుండి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అంత పెద్ద స్టార్ హీరో కుటుంబం నుండి వచ్చినప్పటికీ చాలా సింపుల్‌గా జీవితాన్ని గడిపారు నాగ సరోజ. ఇక ఆమె మరణవార్త తెలుసుకున్న ప్రముఖులు ఆమెకు సంతాపాన్ని తెలుపుతున్నారు.